TG: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి 24 మంది కౌన్సిలర్లు చేరుకున్నారు. కాంగ్రెస్ కౌన్సిలర్లతో పాటు 18వ వార్డు(బీజేపీ) కౌన్సిలర్ భానుప్రియ వచ్చారు. అలాగే, BRS, స్వతంత్ర సభ్యులు హాజరయ్యారు. కాగా, MLA మల్రెడ్డి రంగారెడ్డి ఎక్స్అఫిషియోగా నమోదు చేసుకున్నారు. కాసేపట్లో సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత మున్సపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్లు ఎన్నుకుంటారు.