SRD: కంగ్టి మండలం చాప్టా (కే) గ్రామంలో విశ్వగురు మహాత్మ బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఖేడ్ మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డిని నేడు గ్రామస్తులు ఆహ్వానించారు. ఈనెల 19న జరుపతలపెట్టిన విగ్రహ ఆవిష్కరణ కరపత్రాన్ని ఆయనకు అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బసవేశ్వరుడు విశ్వవ్యాప్త ప్రజలకు మహాత్ముడని, ఆయన అడుగుజాడల్లో నడవాలన్నారు.