SRD: ఇటీవల జీహెచ్ఎంసీలో విలీనమైన ముత్తంగి డివిజన్ పరిధిలోని ప్రతి వార్డులో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం ఉదయం ముత్తంగి డివిజన్ పరిధిలోని డిఎన్ కాలనీ, న్యూటౌన్ కాలనీలలో ఎమ్మెల్యే జీఎంఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో సమావేశమైనారు.