NZB: CP పీ.సాయి చైతన్య ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీ ఇన్ఛార్జ్ మస్తాన్ వాలి ఆధ్వర్యంలో పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. టౌన్- 2 పోలీస్ స్టేషన్ పరిధిలోని హైమద్పూర్ కాలనీలో 10 క్వింటాళ్ల పీడీఎస్-రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ.40,000లుగా అంచనా వేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని టౌన్- 2 పోలీస్ స్టేషన్ SHOకు అప్పగించారు.