Gold Rates Today : గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరలు పెరిగినంత వేగంగా, తగ్గడం లేదనే చెప్పాలి. పెరిగినప్పుడు భారీగా పెరుగుతున్న ధరలు, తగ్గినప్పుడు మాత్రం అరకొరగా తగ్గుతున్నాయి. శుక్రవారం బంగారం, వెండి ధరలు కాస్త తగ్గాయి. ఏది ఎంత ఉందనేది తెలియాలంటే.. ఇది చదివేయండి.
Gold and Silver Rates Today : పసిడిని కొనుక్కోవాలని, పెట్టుబడి మార్గంగా మలుచుకోవాలని ఆలోచనల్లో ఉన్న వారు రోజువారీ పసిడి రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది చదివేయండి. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర శుక్రవారం కొద్దిగా తగ్గింది. గురువారం రూ.72,160 ఉండగా, శుక్రవారం నాటికి రూ.413 తగ్గి రూ.71,747కు చేరుకుంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు తదితర ప్రధాన పట్టణాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.71,747 కొనసాగుతోంది. ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవని గుర్తుంచుకోవాలి. కొనుగోలుదారులు నగల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు జీఎస్టీ, మజూరీల్లాంటివి అదనంగా తోడవుతాయని గమనించుకోవాలి.
దేశీయ మార్కెట్లలో కిలో వెండి ధర(Silver Rate) సైతం శుక్రవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. గురువారం కిలో వెండి ధర రూ.81,220 ఉండగా, శుక్రవారం నాటికి రూ.75 తగ్గి రూ.81,145కు చేరుకుంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరుల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. వెండి, బంగారం రెండూ కూడా నేటి మార్కెట్ ప్రారంభ సమయానికి స్వల్పంగా తగ్గుముఖం పట్టడం గమనార్హం.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర భారీగా తగ్గింది. గురువారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2,299 డాలర్లు ఉండగా, శుక్రవారం నాటికి 23 డాలర్లు తగ్గి 2,276 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 26.53 డాలర్లుగా ఉంది.