విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రణబాలి’. అనంతపురంలో జరిగిన ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది. ఈ సందర్భంగా స్థానిక అభిమానులు, రౌడీ ఫ్యాన్స్ బైక్ ర్యాలీలతో హీరోహీరోయిన్లకు ఘనస్వాగతం పలికారు. భారీ అంచనాలున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2026 సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.