NZB: ఆర్మూర్‌లోని పోచమ్మ గల్లి 13వ వార్డులో అంబేడ్కర్ మాల సంఘం భవనం శిథిలావస్థలో ఉండటంతో పునర్నిర్మాణానికి రూ.15 లక్షలు మంజూరు చేయాలని శనివారం సంఘం సభ్యులు కోరారు. మున్సిపల్ ఛైర్పర్సన్ గోనె లహరి, వైస్ ఛైర్మన్ కాటిపల్లి వెంకటరెడ్డి, కౌన్సిలర్ కోడిమేల మల్లయ్యకు వినతిపత్రం అందజేశారు. సంఘం నాయకులు భవనం పునర్నిర్మించాలన్నారు.