SDPT: బెజ్జంకి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లీ సత్యనారాయణ రథంపైకి ఎక్కి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ వేద మంత్రోచ్చారణల మధ్య ఆయనను సన్మానించింది. భక్తులు భారీగా తరలి వచ్చి భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.