TG: హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి ఈనెల 9 నుంచి హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు పర్యాటకశాఖ ప్రణాళికలు చేస్తోంది. ఈ యాత్రకు బెల్-407 హెలికాప్టర్‌ను వినియోగించనున్నారు. HYD నుంచి ఉదయం బయలుదేరి సోమశిల, శ్రీశైలం క్షేత్రాల్లో VIP దర్శనాలు పూర్తి చేసుకుని సాయంత్రానికి తిరిగి నగరానికి చేరుకుంటారు. ఒక రోజుకు రూ.1.10 లక్షలు, రెండు రోజులకు రూ.1.40 లక్షలుగా నిర్ణయించారు.