SRD: కంగ్టి మండల కేంద్రంలోని సిద్దేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో నేడు భారీ కుస్తీ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ శివ రుద్రప్ప శనివారం తెలిపారు. కర్ణాటక మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున పహిల్వాన్లు రానున్నారని తెలిపారు. స్థానికంగా కుస్తీ పోటీలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్టు చెప్పారు. గ్రామస్తుల ఆధ్వర్యంలో ఈ పోటీలు కొనసాగుతాయని పేర్కొన్నారు.