JGL: మల్యాల మండల కేంద్రంలోని గరకుంట్ల మైసమ్మ కట్ట ప్రాంతంలో ఆంజనేయ స్వామి రాతి విగ్రహం బయటపడింది. వ్యవసాయ పనులకు వెళ్తున్న రైతులు విగ్రహాన్ని గమనించారు. వెంటనే పలువురు అక్కడి స్థలాన్ని చదును చేసి, విగ్రహాన్ని శుద్ధి చేశారు. ఇవాళ పురోహితులతో పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పట్టణ గౌడ సంఘం మాజీ అధ్యక్షుడు సుమన్ తెలిపారు.