VKB: యాలాల్ మండల కేంద్రం నుంచి తాండూరుకు వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారి ప్రయాణికులకు నరకం చూపిస్తోంది. రోడ్డుపై పెద్ద ఎత్తున ఏర్పడిన గోతులతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో ఈ మార్గంలో ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.