AP: CM చంద్రబాబు వ్యాఖ్యలు మోసపూరితమని YCP నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. రాజధానిని రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పి, ఇప్పుడు నిరంతర ప్రక్రియ అంటూ మాట మారుస్తున్నారని మండిపడ్డారు. అమరావతి పేరుతో కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, రాయలసీమ అభివృద్ధిని విస్మరించారన్నారు. YSR ప్రారంభించిన పోలవరం ప్రాజెక్టును తన ఖాతాలో వేసుకోవడం హాస్యాస్పదమని విమర్శించారు.