NLG:చిట్యాల పురపాలిక పరిధిలోని శివనేనిగూడెంలో శాసనమండలి మాజీ డిప్యూటీ ఛైర్మెన్ నేతి విద్యాసాగర్ శుక్రవారం సందడి చేశారు. తన అభిమాని ఎడ్ల మహాలింగం నివాసానికి వెళ్లిన ఆయన, ఆ దంపతులను ఆశీర్వదించి కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ముందుకు సాగాలని ఆయన సూచించారు.