KDP: తొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రేపు మోకాళ్ల నొప్పుల నివారణకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు మండల వైద్యాధికారి డాక్టర్ సుభాషిణి తెలిపారు. ఈ శిబిరంలో ప్రఖ్యాత రోబోటిక్ మోకాలి కీలు మార్పిడి నిపుణులు డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి వైద్య సేవలు అందిస్తారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సుభాషిణి చెప్పారు.