HNK: నగరంలో చారిత్రాత్మకమైన హనుమద్గిరి పద్మాక్షి దేవి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈరోజు శుక్రవారం సందర్బంగా అమ్మవారికి అర్చకులు ప్రత్యేక అలంకరణ చేశారు. వివిధ రకాల ద్రవ్యాలతో తల్లికి అభిషేకాలు చేశారు. అనంతరం పూలతో, పూలమాలలతో అమ్మవారిని అలంకరించి, భక్తుల సమక్షంలో హారతి ఇచ్చారు. ఆలయం మొత్తం భక్తులతో నిండిపోయింది.