ADB: ఈనెల 5న బాబూ జగ్జీవన్ రామ్ 119వ జయంతిని ఆదిలాబాద్లో అధికారికంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఉదయం 9 గంటలకు జగ్జీవన్ చౌక్ వద్ద విగ్రహానికి పూలమాలలు వేసి, అనంతరం ఎస్టీయూ భవనంలో బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో జిల్లా ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.