KNR: శంకరపట్నం మండలంలో గ్యాస్ సిబ్బంది పేరుతో ఇళ్లలోకి ప్రవేశించి బంగారం దోచుకుంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఈ మేరకు ఒంటరి మహిళలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. తాళం వేసిన ఇళ్లలో సైతం దొంగతనాలు జరుగుతున్నాయని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కేశవపట్నం ఎస్సై శేఖర్ రెడ్డి పేర్కొన్నారు.