శర్వానంద్ ‘బైకర్’ మూవీ ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. తెలుగు తెరపై ఇప్పటివరకు రాని మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. రేసింగ్ సన్నివేశాల చిత్రీకరణ, శర్వానంద్ ఫిట్నెస్, రాజశేఖర్ నటన సినిమాను నిలబెట్టాయి. ముఖ్యంగా తండ్రీకొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ మెప్పిస్తాయి. అయితే, ఫస్టాఫ్ నెమ్మదిగా సాగడం, కథలో కొన్ని రొటీన్ అంశాలు కొంచెం మైనస్. రేటింగ్: 3/5.