NZB: సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ స్ఫూర్తితో ముందుకెళ్దామని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా వినాయక్‌నగర్‌లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పోరాట యోధుడు పాపన్నగౌడ్ వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని వివరించారు.