కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు బాస బాల్ కిషన్ నేడు హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా జిల్లేడు ఆకుపై చక్కటి ఆంజనేయ స్వామి చిత్రం వేశాడు. హనుమంతుడు బలం, బుద్ధి, భక్తి, ధైర్యానికి ప్రతీక అని చిత్రం ద్వారా సందేశం ఇచ్చారు. ఈ చిత్రం చూసిన పలువురు బాల్ కిషన్‌ను అభినందించారు. కాగా వినూత్నంగా చిత్రాలు వేసే చిత్రకారుడిగా పేరుపొందారు.