NLG: నకిరేకల్ పట్టణ మైనార్టీ సంఘం అధ్యక్షుడిగా మతీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనార్టీల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మైనార్టీ వర్గాల అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. తనకు ఈ అవకాశం కల్పించిన సంఘ సభ్యులందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.