NGKL: మాజీ సీఎం కేసీఆర్ కార్యాలయంపై దాడి ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, గోలి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం కల్వకుర్తిలో వారు మాట్లాడుతూ.. మాజీ సీఎం కార్యాలయానికే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు.