SDPT: జగదేవపూర్ మండల కేంద్రంలో భద్రతను పటిష్టం చేసేందుకు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పనుగట్ల శ్రీనివాస్ గౌడ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలోని ప్రధాన కూడళ్లు, వీధుల్లో అత్యాధునిక సీసీ కెమెరాల ఏర్పాటు పనులను ఆయన స్వయంగా పర్యవేక్షించారు.నేరాలు, దొంగతనాల నియంత్రణే లక్ష్యంగా ఈ నిఘా నేత్రాలను బిగిస్తున్నట్టు ఆయన తెలిపారు.