E.G: సీతానగరం మండలం పెదకొండేపూడిలో సంచరించిన పులి పాద ముద్రలను అటవీశాఖ అధికారులు గురువారం గుర్తించారు. ప్రస్తుతం పెదకొండేపూడిలో గోశాలకు సమీపంలోని కొండపై పులి ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. రాత్రికి పులి కొండ దిగే సమయంలో నేలకోట రామవరపు ఆవ వైపు లేదా ఎక్కిన దారిలోనే పెదకొండేపూడిలో దిగేందుకు అవకాశాలు ఉన్నట్లు అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు.