NLG: జిల్లాలో మార్చి 21న రంజాన్ జరుపుకోనున్నట్లు మత పెద్దలు ప్రకటించారు. నెలవంక కనిపించకపోవడంతో శనివారం పండుగ నిర్వహించాలని మౌలానా ఎహసానుద్దీన్ ఖాస్మీ తెలిపారు. స్థానిక ఈద్గాలో ఉదయం 8:30 గంటలకు, మదీనా, ఉస్మానియా మసీదుల్లో 8:00 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు (నమాజ్) జరుగుతాయి. ముస్లిం సోదరులు పండుగకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.