MNCL: ఇసుక విషయంలో ప్రభుత్వ ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నామని జన్నారం FDO రామ్మోహన్ తెలిపారు. ఇసుక లేక ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోతున్నాయన్న విషయాన్ని హిట్ టీవీ ఆయన దృష్టికి తీసుకువెళ్లింది. ప్రస్తుతం ఉన్న ఉత్తర్వుల ప్రకారం పది కిలోమీటర్ల దూరంలో ఇసుక సేకరణను నిలిపివేశామన్నారు. దాన్ని ఒక కిలోమీటర్ వరకు పరిమితం చేసేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపమన్నారు.