MHBD: రైతుపై అడవిపంది దాడిచేసిన ఘటన గంగారం మండలంలో గురువారం జరిగింది. తిరుమల గండి గ్రామ శివారు పుట్టలభూపతి గ్రామానికి చెందిన ఓ రైతు రోజు మాదిరిగానే తన మొక్కజొన్న చేను కావలికి వెళ్లాడు. అప్పటికే అదే చేనులో ఉన్న అడవిపంది అతనిపై దాడి చేసి, కుడి కాలును కొరకడంతో తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.