AP: ప్రభుత్వ, రిటైర్డ్ ఉద్యోగులకు గత ప్రభుత్వ బకాయిల చెల్లింపులపై కసరత్తుకు CM చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు ఆర్థికశాఖ నిధుల లభ్యత ఆధారంగా ఉద్యోగులకు రూ.7,059 కోట్ల మేర చెల్లింపుల ప్రక్రియను ప్రారంభించింది. దీంతో సదరు ఉద్యోగులకు భారీ ఊరట కలగనుంది. ఇప్పటికే PF కింద రూ.1847.83 కోట్లు ఉద్యోగుల ఖాతాల్లో జమ కాగా.. GLI కింద రూ.76 కోట్ల మేర చెల్లింపులు కూడా పూర్తయ్యాయి.