ఆసిఫాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్గా అనిల్ కుమార్ను తెలంగాణ ప్రభుత్వం నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్లో సీనియర్ నాయకుడిగా ఉన్న అనిల్ కుమార్ పేరును ప్రభుత్వం ఖరారు చేసింది. ఆయన నియామకంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అనిల్ కుమార్ సారథ్యంలో జిల్లాలోని గ్రంథాలయాలు అభివృద్ధి చెందుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు.