VZM: పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యపడుతుందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గురువారం గజపతినగరంలోని ఎస్సీ కాలనీలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీపురు పట్టి శుభ్రం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తడి పొడి చెత్తలను వేరువేరుగా అందజేయాలని సూచించారు. ఏఎంసీ ఛైర్మన్ గోపాలరాజు పాల్గొన్నారు.