NLG: చండూరులోని మునుగోడు బైపాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన టాటా కారు కూడలిలోని డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి డివైడర్ ముక్కలు ముక్కలవ్వగా, కారు స్వల్పంగానే దెబ్బతినడం చర్చనీయాంశమైంది. దీంతో ‘బిల్డ్ క్వాలిటీ’పై స్థానికులు చర్చించుకుంటున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులోని వారు సురక్షితంగా బయటపడ్డారు.