WGL: నగరంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఓ మిర్చి ఖరీదారుడు రూ.5 కోట్లతో పరారైన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. గాయత్రి చిల్లీస్ పేరుతో మార్కెట్లో మిర్చి వ్యాపారం నిర్వహిస్తున్న వ్యాపారి ఈ మొత్తం నగదుతో పరారైనట్లు సమాచారం. ఈ ఘటనతో రైతులు, వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.