KMM: ఉమ్మడి జిల్లాలోని నిర్మాణ కార్మికులకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు లేబర్ డీఎల్సీ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. ఎనిమిదో తరగతి ఉత్తీర్ణతతో పాటు 18-30 ఏళ్ల లోపు ఉన్న వారికి ఉచిత శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామన్నారు. తాపీ, ఎలక్ట్రికల్, వెల్డింగ్ రంగాల్లో ఆసక్తి ఉన్నవారు సమీప కార్మిక శాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.