గుంటూరు: రైల్వే డివిజన్లో 70వ రైల్వే వీక్ అవార్డులు ప్రదానం చేశారు. పట్టాభిపురంలోని డివిజన్ కార్యాలయంలో బుధవారం ఈ కార్యక్రమం జరిగింది. డీఆర్ఎం సుధేష్ణ సేన్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. మొత్తం 14 మంది ఉద్యోగులకు అవార్డులు అందించారు. విధుల్లో ప్రతిభ, కృషి కనబరిచిన సిబ్బందిని అభినందించారు. వారి నిబద్ధత ఇతరులకు ప్రేరణగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.