AKP: సబ్బవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2023-26 బ్యాచ్ బీఏ, బీకాం విద్యార్థుల దీర్ఘకాలిక ఇంటర్న్‌షిప్ ముగింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ బి. శంకర్ మాట్లాడుతూ.. ఉపాధి అవకాశాలున్న కోర్సులు ఎంచుకుని సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. మాడుగుల కళాశాల నుంచి డాక్టర్ అంబేడ్కర్ రాజు ఎక్సటర్నల్ ఎగ్జామినర్‌గా పాల్గొన్నారు.