MBNR: జిల్లాకు చెందిన 12 ఏళ్ల మంగరి వంశీకృష్ణ ‘ఆకలేషియా కార్డియా’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. మలక్ పేట యశోద ఆసుపత్రిలో చేరిన బాలుడికి, ఆహారం మింగడంలో ఇబ్బందులను గుర్తించిన వైద్యులు అధునాతన ఇండస్కోపిక్ చికిత్స అందించారు. బుధవారం గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ కిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ చికిత్సతో బాలుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.