CTR: జిల్లాలోని వివిధ ధాబాలు, లాడ్జీలపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద కార్యకలాపాల నివారణ, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై నిఘా కోసం ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. తనిఖీల సందర్భంగా అతిథుల నమోదు వివరాలు, సీసీ కెమెరాల పనితీరు, లైసెన్సుల పరిస్థితిని పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించిన యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు.