KNR: కరీంనగర్ నగరంలో పెండింగ్లో ఉన్న చీటింగ్, ఫోర్జరీ కేసుల విచారణను వేగవంతం చేయాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. బుధవారం టౌన్ డివిజన్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గురువారం హనుమాన్ జయంతి బైక్ ర్యాలీ నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ మళ్లింపులతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు.