MNCL: ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా గత ఏడాది అక్టోబర్ నుంచి అక్షర కేంద్రాల్లో చదువు నేర్చుకుంటున్న అభ్యాసకులకు అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ నెల 29న పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా వయోజన విద్యాశాఖ అధికారి పురుషోత్తం తెలిపారు. పరీక్షకు హాజరు కాబోయే అభ్యాసకులు తమ గ్రామాలలోని సెర్ప్ సిబ్బందిని సంప్రదించి పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.