NLG: నకిలీ కరెన్సీ పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న నిందితుడిని తిప్పర్తి పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. నిందితులు వాట్సాప్ ద్వారా ప్రజలను సంప్రదించి, రూ.500 నోట్ల ఆకారంలో ఉన్న కాగితాలను చూపించి అసలు నోట్లుగా నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.