MDK: నర్సాపూర్ మున్సిపల్ పరిధిలో ఎర్లీ బర్డ్ స్కీమ్ చెల్లింపులపై విస్తృత ప్రచారం చేపట్టారు. నర్సాపూర్ మున్సిపల్ ఇంఛార్జ్ కమిషనర్ తిరుపతి ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రాంతాలలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈనెల 30 లోగా ఇంటి పనులు చెల్లించి ఐదు శాతం మినహాయింపు పొందాలని పేర్కొన్నారు. ఈ సదావకాశం ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.