SKLM: జిల్లాలో గురువారం తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ బుధవారం తెలిపారు. ప్రధానంగా ఆమదాలవలస, బూర్జలో వడగాల్పులకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎండలు అధికంగా ఉన్నందున అత్యవసరం అయితే తప్ప బయట తిరగరాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.