PDPL: ధర్మారం మండలం పత్తిపాక అంగన్వాడి కేంద్రం-2 లో సర్పంచ్ శ్రావణి ఇటుకబట్టి కార్మికుల పిల్లలకు పౌష్టికాహారాన్ని అందజేశారు. గర్భిణీ మహిళను, 3 సంవత్సరాల లోపు పిల్లవాడిని కేంద్రంలో నమోదు చేయించారు. పిల్లలు, గర్భిణీలు, బాలింతలు క్రమం తప్పకుండా పోషకాహారాన్ని తీసుకోవాలని సూచించారు. ఐదేళ్ల లోపు పిల్లలను అంగన్వాడి కేంద్రాలకు పంపించాలని తల్లిదండ్రులకు సూచించారు.