PPM: సీతానగరం మండల కేంద్రంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయంలో ముడుపుల పూజలు గురువారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గోవింద నామ స్మరణతో భక్తులు 27 సార్లు ప్రదక్షిణలు చేస్తున్నారు. దీనితో పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు , నవ నారసింహ యాగం కూడా ఆలయంలో 9 రోజుల పాటు ఉదయం,సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.