IPL 2026 టోర్నీ ముగిసిన తర్వాత భారత యువ సంచలనాలు వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే ఎర్ర బంతి క్రికెట్ ఆడనున్నారు. జూన్-జూలైలో జరిగే అంతర్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ టోర్నీలో వీరిద్దరూ బరిలోకి దిగనున్నారు. ఈ టోర్నీలో 64 మంది యువ క్రికెటర్లు నాలుగు జట్లుగా విడిపోయి ఆడతారు. టోర్నీలో ప్రదర్శన ఆధారంగా త్వరలో జరిగే శ్రీలంక పర్యటనకు భారత్ ఎమర్జింగ్, అండర్-19 జట్లను ఎంపిక చేస్తారు.