PDPL: గంగాధర మండలం రంగారావుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఈజీఎస్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను బుధవారం సర్పంచ్ దాసరి శంకరయ్య ప్రారంభించారు. గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యానికి ఈ సందర్భంగా సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు.