AKP: ఎస్ రాయవరం మండలంలోని 28 గ్రామపంచాయతీలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ తెలిపారు. బుధవారం దార్లపూడిలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. వేసవికాలం ముగిసేవరకు చలివేంద్రాలు ఉంటాయన్నారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు వీటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో దార్లపూడి సర్పంచ్ సుభాషిణి పాల్గొన్నారు.