ASR: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం జన్మన్ పథకం కింద నిర్మిస్తున్న ఇళ్ళు, బిల్లులు చెల్లించక మొండి గోడలకే పరిమితమయ్యాయని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు లోకనాథం విమర్శించారు. అరకు మండలం పద్మాపురం పంచాయితీ బొండగూడ గ్రామంలో బుధవారం ఆయన పర్యటించారు. అసంపూర్తిగా నిలిచిన ఇళ్లను పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలకు నిధులు విడుదల చేయడం లేదన్నారు