JGL: గొల్లపల్లి మండల కేంద్ర సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. బుధవారం నల్లగుట్టలో ప్రజల సౌకర్యార్థం ఎన్నికల హామీ మేరకు ఏర్పాటు చేసిన నూతన రేషన్ స్టాక్ పాయింట్‌ను ఆయన ప్రారంభించారు. త్వరలో బయోమెట్రిక్ ద్వారా పూర్తి స్థాయి రేషన్ షాపు ప్రారంభిస్తామని, స్టేడియం, రోడ్డు, లైటింగ్ పనులు పూర్తి చేస్తామని చెప్పారు.